రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 10: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.
అయితే గురువారం పద్మవిభూషణ్ అవార్డులను ప్రదానం చేయగా టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.
సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపసాన ఉన్నారు.