ఆసియా మొత్తం భగభగలాడుతోంది..
హ్యూమన్ రైట్స్ టుడే: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగ రాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూరీడు రోజు రోజుకు మరింతగా మండి పోతున్నాడు. ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వ సాధారంగా మారి పోయింది. అంతేకాదు, వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తూర్పు, దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం, వ్యాధులు వ్యాప్తి చెందడం, భూగర్భ జలాలు క్షీణించడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది మన పిల్లల తరానికి మనం అందించబోతున్న గొప్ప ప్రతిఫలం. ఆసియా మొత్తం భగభగలాడుతోంది.