ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి..

Get real time updates directly on you device, subscribe now.

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి..

హ్యూమన్ రైట్స్ టుడే/నారాయణపేట జిల్లా/మే 06: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడి గాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి.

ఓవైపు రోజురోజుకు పెరుగుతోన్న వేడితో ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు. మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

అలాగే, పెరుగుతోన్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరు తపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్ష సంపద లేని ప్రాంతం కావడంతో వన్యప్రాణులు తల దాచకునేందుకు కనీసం నీడ కూడా లేదంంట.

దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి ఆవేదన వ్యక్తం చేశారు.

మద్దూరు రెవెన్యూ భూమి లో కనీసం నాలుగు చిరుతలు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలులతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment