అందుకే సరోగసీని ఎంచుకున్నాం : ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా (Priyanka Chopra), నిక్ జోనాస్ (Nick Jonas) దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను పొందడంపై అప్పట్లో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గర్భాన్ని అద్దెకు తెచ్చుకుందని, రెడీమేడ్ బేబీని కొనుక్కుంది అని ఇలా రకరకాలు కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో ఈ విషయం గురించి ప్రియాంక స్పందించ లేదు. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. ‘‘నా కూతురు మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె చాలా చిన్నదిగా ఉంది. కొన్ని రోజులు ఇంక్యూబేటర్‌లో ఉంచారు. దానికి నేను, నిక్ చాలా బాధపడ్డాం. ఆ సమయంలో డాక్టర్లు, నర్సులు దేవుడి ప్రతిరూపాల్లా నిలిచి నా కూతురుని కాపాడారు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసీని ఎంచుకున్నాం. అంతేకానీ అందం తగ్గిపోతుందనే ఇలా చేశాననడం చాలా బాధకలిగించింది. సోషల్ మీడియా ట్రోల్స్ ప్రభావం నా బిడ్డపై పడకూడదని ఆమె ఫొటోని కూడా ఎక్కడా చూపించ లేదు. సరోగసీ కూడా అంత సులువేం కాదు. ఆరు నెలల పాటు వెతికితే ఓ మనసున్న మహిళ ఒప్పుకుంది. అందుకే ఆమె పేరు కూడా కలిసేలా నా కూతురికి మాల్తీ మారీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టాం’’అని చెప్పింది.