ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/ మే 06: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది.
రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడి సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసాయి.
దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15 న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తిహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది.
కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్ కోసం గత నెల 22న రౌస్ అవెన్యూ, కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయ మూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వుచేశారు.
అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయ మూర్తి స్పష్టం చేశారు.
ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడీషయల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్‌ను న్యాయ స్థానం నిరాకరిస్తే మాత్రం కవితను కోర్టులో హాజరుపరుస్తారు.