హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 06: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ వరుస కార్నర్ మీటింగ్‌లతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటం తో కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నేడు నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు.
కమ్మర్పల్లి నుంచి కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభంకా నుంది. అనంతరం సాయంత్రం నిజామాబాద్‌లోని నెహ్రూపార్క్ వద్ద రోడ్ షోలో పాల్గొంటారు.