6-5-2024 నాడు సోమవారం గద్వాలకు పోదాం బ్రిడ్జిని నిర్మించుకుందాం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 మే: ఈ నెల 2 తేదీన ఐజ సమీకృత కూరగాయల మార్కెట్ నందు జరిగిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజు అందరి ఏకగ్రీవ ఆమోదంతో సోమవారం రేపు గద్వాల్ లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించుకున్నాం. అందరూ కలిసికట్టుగా నిర్ణయించుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఎండలు ఎక్కువగా ఉన్నందువలన ఉదయం 8:30 అంబేద్కర్ విగ్రహం ముందున్న సమీకృత కూరగాయల మార్కెట్ కు చేరుకోగలరు ఉదయం 9 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి గద్వాలకు 10 గంటలకు చేరుకొని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి 11 గంటల వరకు అయిజ చేరుకుందాం.
ఐజ మండలంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ మిత్రులందరు కూడా సమయానికి చేరుకుని చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తరలి రావాలి ఎవరైనా ఫోర్ వీలర్స్ ఉంటే తీసుకొని రాగలరు. అఖిల పక్ష కమిటి ఏర్పాటు చేసిన వాహనాలు ఉప్పయోగించుకోగలరు. దయచేసి ఉదయం 8 గంటలకు చేరుకోగలరు.