జిల్లాలు రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం!!

Get real time updates directly on you device, subscribe now.

జిల్లాల రద్దు పై గందరగోళం!!

ఎటు తేల్చని ప్రభుత్వం!!

రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం!!

హ్యూమన్ రైట్స్ టుడే/నాగర్ కర్నూల్ / మే 5: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అధికారులు ఉండాలని సంకల్పంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి ప్రజలు దూరప్రాంతాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోలేక నానా అవస్థలు పడుతూ అనేక సమస్యలు పెండింగ్లో మగ్గిపోతున్న సందర్భంలో నూతన జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు సౌలభ్యంగా అందుబాటులో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులు అందుబాటులోకి వచ్చారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎంతో సంకల్పంతో ముందు చూపుతో 33 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాలోని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాలను జిల్లా ఎస్పీ కార్యాలయాలను అందంగా చూడ ముచ్చటగా ప్రజలకు సౌలభ్యంగా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చుపెట్టి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అలాంటి కార్యాలయాలు ప్రభుత్వ పరిపాలన ప్రజలకు దరి చేరుతుందా లేదా అనే అనుమానం ప్రజల్లో నెల కొన్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం గత ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి పనులను రూపుమాపడానికి కుట్ర చేస్తుందని టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వం ద్వారా అందిన సమాచారం మేరకు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదింపు చేస్తూ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గం వర్గాలుగా ఉన్న 17 నియోజకవర్గాలలో మాత్రమే జిల్లాలుగా ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే జిల్లాలుగా ప్రకటిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలు రద్దు కావడం తిరిగి నియోజకవర్గాలుగా మాత్రమే ఉంటాయి. కేవలం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ రెండు జిల్లాలు మాత్రమే జిల్లా కేంద్రాలుగా ఏర్పాట అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ రాష్ట్రంలో రద్దు కాబోతున్న జిల్లాల వివరాలకు వెళ్లి పరిశీలిస్తే ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, రంగారెడ్డి, జనగాం, భూపాలపల్లి, సూర్యాపేట, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 33 జిల్లాల్లో 17 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం నూతన శకం ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు, 33 జిల్లాల వల్ల ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఖజానాకు నష్టం వస్తుందని ఆర్థిక పరిస్థితుల వల్ల ఖర్చులు తగ్గించుకునే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే జిల్లాల కుదింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రతి జిల్లాకు ప్రతినెల వేల కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వం పెట్టాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే జిల్లాల కుదింపు కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన అనేక మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు పాల్పడి రద్దు చేసే కార్యక్రమం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేపిస్తామని జిల్లాల రద్దు విషయంపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే ప్రజలకు సరైన సమాధానం చెప్పాలని లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని టిఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఏమి జరుగుతుందో రాబోయే రెండు మూడు నెలలలోపు కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు రోజులు వస్తాయా అనే విషయాలను స్పష్టంగా బయటపడే అవకాశాలున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment