హ్యూమన్ రైట్స్ టుడే/ క్రైమ్/ 03 మే : గతంలో రోహిత్ వేముల విషయంలో మద్దతుగా నిలిచి కొట్లడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేయకుండా కేసు క్లోజ్ చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్ ఏమి లేవని కోర్టుకు నివేదిక ఇచ్చిన పోలీసులు.
ఇందులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుకు ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చారు.
అంతే కాకుండా రిపోర్టులో రోహిత్ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని ఉండటం చర్చనీయాంశంగా మారింది.