హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 03: రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలనం…
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధా కిషన్ రావు వెల్లడించారు.