హ్యూమన్ రైట్స్ టుడే/అదిలాబాద్/మే 03: కాంగ్రెస్ సామాగ్రి పట్టివేత..ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పౌజ్ పూర్ వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కూడిన కీ చైన్స్, బొట్టు బిల్లలను స్వాధీనం చేసుకున్నట్లు బృందం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో బృందం సభ్యులు గణేష్, కిష్టన్న, అనిల్, తదితరులు ఉన్నారు.