హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 28: భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలు ఓటర్లదేలదే అని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “భారతదేశంలో ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విలువలకు సవాళ్లు: ప్రజలు, ఓటర్ల బాధ్యత” అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి k లక్ష్మణ్ కుమార్ అధ్యక్షత వహించారు. న్యాయవాది రాజశేఖర్ వక్తలుగా విచ్చేసి ప్రసంగించారు .
మాట్లాడుతూ ప్రస్తుత భారత ప్రజాస్వామ్య పరిస్థితి గురించి ఆందోళనలు వ్యక్తం చేశారు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మాణంలో ఓటర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అవినీతి రహిత ప్రభుత్వా నిర్మాణంలో ఓటర్లదే కీలక బాధ్యత అని శ్రీనివాస్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్క ఓటరు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మబద్ధంగా వ్యవహరించి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి స్థానిక సమస్యలపై తెలిసి ఉండి ప్రజల పక్షాన చట్టసభలో తన గళం వినిపించే వ్యక్తిని ఎన్నుకోవాలని నిజాయితీగా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. డబ్బులు మధ్యo తదితర కానుకలను పంచే, తైలాలకు లోబరుచుకునే వ్యక్తులను ఎన్నుకో రాదని సూచించారు. వ్యక్తులనుభారత గణతంత్రం పౌరులకు సామాజిక-ఆర్థిక సమానత్వం అందించాల్సిన బాధ్యత గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను విచ్ఛిన్నం చేయడానికి అధికారంలో ఉన్నవారు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు సామాజిక-ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి అత్యవసర అవసరాన్ని నొక్కిచెప్పారు.
అంతేకాకుండా, ప్రజాస్వామ్యం యొక్క నిజమైన సారాంశం సమానత్వం, సంపద పంపిణీ, బలమైన ప్రతిపక్ష పార్టీలు, చట్టం యొక్క నిష్పాక్షికత మరియు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండటమే అని ప్రజల సంక్షేమానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం అనివార్యమని తెలియజేశారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామిక ప్రాథమిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పాల్గొనాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రజల శ్రేయస్సు మౌలిక సదుపాయాలు కనీస అవసరాలు కొరకు మద్దతు కూడగట్టడంలో సంప్రదాయ మరియు సోషల్ మీడియా కీలక పాత్రను వారు నొక్కి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం మరియు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.