రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 26:
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయనాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది, తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్‌పార్కుకు వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్ రావు.

రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించి గన్ పార్క్ వద్దకు వచ్చానని తెలిపారు. రేవంత్ రెడ్డి దేవుళ్లను వదలకుండా ప్రమాణాలు చేస్తున్నారని అన్నారు. తన రాజీనామా పత్రం రెడీగా ఉందని చెప్పారు.

ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు ఇస్తారా? అని నిలదీశారు.

రేవంత్ సీఎం అయ్యాక ఒక్క సారి కూడా గన్ పార్క్ అమరవీరులకు నివాళులు అర్పించలేదని తెలిపారు. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ, 6 గ్యారెంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తన స్టాఫ్ తో నైనా పంపించాలని అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నానని తెలిపారు. తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు ఇచ్చి వెళ్తున్నానని అన్నారు.

హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పారు. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment