హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 26: తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది.