నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరుడు నిర్వాకం..
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/ఏప్రిల్ 20: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల గ్రామ పంచాయతీ సర్పెల్లి తండాలో వడ్డెర కాలనీలో గ్రామపంచాయితీ భవన నిర్మాణం మొదలెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరుడు నర్సారెడ్డి.
తనకు అనుకూలంగా ఉన్న వడ్డెర కాలనీలోనే భవన నిర్మాణం మొదలెట్టిన ఎమ్మెల్యే అనుచరుడు.
గ్రామ పంచాయితీ గ్రామం మధ్యలో కాకుండా ఒక కాలనీలో కట్టడం ఏంటని గ్రామస్తుల ఆందోళన.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు పనులు చేయకూడదని తెలిసి కూడా రాత్రి జెసిబి పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరుడు నర్సారెడ్డి తను అనుకున్న స్థలంలో భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభం.