హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్: కమల్‌హాసన్ – శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. ‘భారతీయుడు2’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకు వచ్చిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్నచిత్రమిది. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు. కథానాయకుడు సిద్ధార్థ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఈ ఆదివారం నుంచి తిరుపతి పరసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఆ మేరకు చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంది. శంకర్ ప్రస్తుతం ఇటు రామ్‌చరణ్‌తోనూ, అటు కమల్‌హాసన్‌తోనూ సమాంతరంగా రెండు సినిమాల్ని చేస్తున్నారు. ‘భారతీయుడు2’ చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.