హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఏప్రిల్ 20: ఉప్పల్ స్టేడియం వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ నిరసనకు దిగింది.
స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి సంఘాలు. లోపలికి వెళ్ళే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్టేడియం మెయిన్ గేటు వద్ద బైఠాయించారు.
ఏఐవైఎఫ్, డీ ఐ వై ఎఫ్,పి వై ఎల్ నాయకులు. అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యప్రసాద్ ఆరోపించారు.
ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ స్టేడియం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లకాడ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70 వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.
దీంతో క్రికెట్ అభిమానులు తమకు టికెట్లు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.