హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 20: హైదరాబాద్ లోని మాంసం దుకాణాదారులకు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
చికెట్, మటన్, ఫిష్ అమ్మకాలను నిషేధించింది. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు హైదరాబాద్ మహా నగరంలో జైనుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నారని వారి కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా మాంసం షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, మహావీర్ జయం తిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజున ఎలాంటి జీవహింస చేయరు. ఈ క్రమంలోనే మాంసాహారం బంద్‌కు పిలుపునిచ్చారు.
జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మార్కెట్లతో పాటు మాంసం షాపులు కూడా బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.