కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత
హ్యూమన్ రైట్స్ టుడే/నిర్మల్ జిల్లా /ఏప్రిల్ 20:
తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి.
మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజెన్ అయి మరణించాడు. ఈ సంఘటన మరువక ముందే మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశాలలో ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది.
దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు.