హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ఏప్రిల్ 20:
తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులకి నష్టం చేకూరింది.