హ్యూమన్ రైట్స్ టుడే/గుజరాత్:
గుజరాత్‌లో భాజపా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఓ బంగారం వ్యాపారి ప్రధాని నరేంద్రమోదీ ప్రతిమను బంగారంతో తయారుచేశాడు. సూరత్‌కు చెందిన బసంత్ బోహ్రాకు మోదీ అంటే అభిమానం. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రధాని నాయకత్వంలో భాజపా 182 సీట్లకు గానూ 156 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయానికి గుర్తుగా బసంత్ 18 క్యారెట్ బంగారంతో 156 గ్రాముల బరువైన మోదీ ప్రతిమను రూపొందించారు. దీనికి సుమారు రూ.11 లక్షలు ఖర్చయింది. చాలా మంది దీనిని దక్కించుకోడానికి పోటీ పడుతున్నా.. ప్రస్తుతానికి ప్రతిమను అమ్మాలనే ఆలోచన లేదని బోహ్రా తెలిపారు. విగ్రహం తయారీ డిసెంబరులోనే పూర్తయిందని.. ప్రతిమ బరువును సీట్ల సంఖ్య 156తో సమానం చేయడానికి కాస్త సమయం పట్టిందన్నారు.