ఎన్నారై బోర్డ్ ఏర్పాటు చేయాలని సీఎం కు నివేదిక అందజేత..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 17: సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆర్ ఐ అఫ్ఫైర్స్ సెక్రెటరీ కి ఎన్ ఆర్ ఐ పాలసీ నివేదికను అందజేసిన టీ పీ సీ సీ ఎన్ ఆర్ ఐ కన్వీనర్ షేక్ చాంద్ పాషా.

గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని టీపీసీసీ సెల్ ఎన్ఆర్ఐ కన్వీనర్ షేక్ చాంద్ పాషా అన్నారు.

హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్లో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డీ ని షేక్ చాంద్ భాషా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా 20 ఏళ్ల పాటు గల్ఫ్ కార్మికుల కోసం తాను చేస్తున్న సేవలతో పాటు గల్ఫ్ కార్మికులకు అవసరమైన చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్ఆర్ఐ పాలసీ  ఏర్పాటు చేయాలని తాను రూపొందించిన 9 పేజీల నివేదికను రేవంత్ రెడ్డికి చాంద్ పాషా అందజేశారు.

అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఎన్ఆర్ఐ అఫైర్స్ సెక్రటరీ కి నివేదిక అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ..

– ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులకు  గల్ఫ్ లో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్ జారీచేసి నైపుణ్యాలకు అనుగుణంగా స్థానికంగా, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి.

– ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల కోసం ఆన్లైన్, ఆన్లైన్ ద్వారా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలి.

– గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన కార్మికులకు, గల్ఫ్ బాధిత కుటుంబాలకు రిహాబిలిటేషన్ పథకం రూపొందించి, ఆదుకోవాలి.

గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు పిఎంకేఆర్ ఫండ్స్ మాదిరిగా ప్రత్యేక నిధి ఏర్పాచేసి గల్ఫ్ కార్మికులకు సంక్షేమానికి పెద్దపీఠ వేయాలి.

– గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం ఎన్ఆర్ఐ కమిషన్, ఎన్ఆర్ ఐ పోలీసే స్టేశన్లు, ఎన్ఆర్ఐ కోర్టులు, ఎన్ఆర్ ఐ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలి.

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి మానసిక ఒత్తిళ్లతో బలవన్మరణాలకు పాల్పడినా.. సాధారణంగా మృతి చెందినా ఏ విధంగా మరణించినా, గల్ఫ్ బాధిత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించి ఆదుకోవాలి.

– గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన కార్మికుల కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలు, ఉపాధి కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలి.

గల్ఫ్ లో ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రవాస భారతీయ భీమా పథకం కింద అందిస్తున్న రూ. 10 లక్షల పరిహారాన్ని రూ. 25 లక్షలు పెంచాలని కోరుతూ రూపొందించిన నివేదిక పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో ప్రోటోకాల్ ఎన్ఆర్ఐ సెల్ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్, మాజీ భారత రాయబార అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment