హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: 2040 నాటికి చంద్రుడి పైకి వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్ జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడి పైకి వ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరి కోటలోని షార్ లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగు పరుచుకుంటున్నామని పేర్కొన్నారు.