హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 13న జరగనున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. కళారంగంలో రామ్‌చరణ్ అందించిన సేవలకుగానూ డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్‌చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.