హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11: నేడు ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారు. కాగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.