హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:
రంజాన్ స్పెషల్ ‘షీర్‌ఖుర్మా’ రంజాన్ పండుగ రోజు అందరి దృష్టి ‘షీర్ఖుర్మా’ పైనే ఉంటుంది. పండుగ రోజు నమాజ్ ముగిశాక మిత్రులు, బంధువులతో పంచుకునేందుకు వారందరిని ఇండ్లకు ఆహ్వానిస్తారు. ఉపవాసాలు, ఐదుపూటల నమాజ్, చివరి పది రోజుల్లో ఎతెఖాఫ్, షబే ఖదర్, జాగరణ రాత్రులతో నెల రోజుల పాటు ముస్లింలు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. చివరి రోజు ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత ముస్లీంలు సోదరభావంతో హిందువులకూ ‘ షీర్ ఖుర్మా ‘ అందిస్తారు.