హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11: చైనాతో సంబంధాలు ప్రపంచానికీ కీలకం:మోదీ
న్యూయార్క్‌కు చెందిన ‘న్యూస్ వీక్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని పేర్కొన్నారు. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన.. దౌత్య, సైనిక స్థాయిల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.