రేవంత్ రెడ్డిని కలవరపెడుతున్న కాంగ్రెస్ సర్వేలో విస్తుపోయే నిజాలు..
120 రోజుల రేవంత్ రెడ్డి పాలన వల్ల ఎంపీ ఎన్నికల్లో ఎసరు..రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితమే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి చేరిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్.
నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 లోక్ సభ స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 100 శాతం గెలిచే ఛాన్స్ లేదని చెప్పేసిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే.
మెదక్, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు, మిగతా స్థానాల్లో పోటాపోటీ ఉన్నట్లు చెప్పిన సర్వే రిపోర్ట్.
మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో గెలుపుకు చాలా దూరంలో ఉన్న కాంగ్రెస్. దీంతో హడావిడిగా కొడంగల్ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.
సీఎం స్థాయి వ్యక్తి షెడ్యుల్ అంటే ముందే నిర్ణయించి దానికి తగ్గట్లుగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు. 2 రోజుల క్రితం జరిగిన కొడంగల్ మీటింగ్ హడావిడిగా ఏర్పాటు చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కరువు పరిస్థితులు, రైతుల్లో వ్యతిరేకత, రైతు బంధు ఆలస్యం చేసి రైతుల నమ్మకం కోల్పోవడం, అధికారంలోకి రాగానే వెంటనే రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని దాని గురించి ప్రస్తావనే లేకపోవడం, పాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల మీద శ్రద్ద పెట్టడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
మొన్నటి వరకు 100 రోజుల మా పాలనే లోక్ సభ ఎన్నికల్లో రెఫరెండం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక్కసారిగా స్వరం మార్చాడు.
మహబూబ్ నగర్లో ఓడిపోతే రేవంత్ సొంత జిల్లాలో సీటు నిలబెట్టుకోలేదు అనే అపవాదు ఒక్కటే కాకుండా డీకే అరుణ ఉన్న రూపంలో రేవంత్ రెడ్డికి ముప్పు పొంచి ఉంది. ఆమె గెలిచి కేంద్ర మంత్రి అయితే గతంలో ఆమెతో ఉన్న వివాదాల కారణంగా లేని తలనొప్పి తెచ్చుకున్నట్లే.