మోదీ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్?: మంత్రి పొన్నం
హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల/ఏప్రిల్ 10: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు. రాముడి ఫోటోతో ఎన్నికల ప్రచారమా? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, మరి బీజేపీ ఏం ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
మాకు కాదా దేవాలయాలకు ఏం చేశావ్ బండి సంజయ్ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మంగళ సూత్రాన్ని అమ్ముకున్న నీకు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివని నిలదీశారు. కొండగట్టు అంజన్నను లిక్కర్ రాణి మోసం చేసిందని, పెద్ద విగ్రహం పెడతామని శఠగోపం పెట్టిందన్నారు. అందుకే అంజన్న అగ్రహించాడని, బీఆర్ఎస్, బీజేపీలవి మోసపూరిత హామీలని మండిపడ్డారు. బీఅర్ఎస్, బీజేపీలవి మోసపు హామీలని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు.