కేటీఆర్ ఫోటో.. సమంత కామెంట్.. ఏం చేసిందంటే..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 10: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయ పరంగానే కాదు సామాజికంగా, అత్యవసరమైన వారి అభ్యర్థనలకు సైతం స్పందిస్తుంటారు. అయితే, తాజాగా కేటీఆర్ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు సినీ నటి సమంత కామెంట్ చేశారు. దాంతో ఆ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కామెంట్‌కు నెటిజన్లు రిప్లయ్స్ మీద రిప్లయ్స్ ఇస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారు? సమంత ఏం కామెంట్ పెట్టారు? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేటీఆర్.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సైతం ఉండటంతో నిత్యం సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలు, కేసులను ఎదుర్కొంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రమ్‌లో కేటీఆర్ ఒక పోటో షేర్ చేశారు. చుట్టూ జనాల మధ్య తాను చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు కేటీఆర్. ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
కేటీఆర్ ఫోటోకు ఫస్ట్ కామెంట్ సమంత చేసింది. కేటీఆర్ షేర్ చేసి ఫోటోను లైక్ చేయడమే కాకుండా.. ఆ ఫోటోకు ‘నమస్తే’ ఎమోజీని కామెంట్‌గా పెట్టింది సమంత. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. సమంత కామెంట్‌పై నెటిజన్లు రకరకాల కమెంట్స్, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.