హ్యూమన్ రైట్స్ టుడే/అల్లూరి జిల్లా/ఏప్రిల్ 10:
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
సరైన రోడ్డు సౌకర్యం లేకపో వడంతో కొడుకు మృతదే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంత గిరి మండల పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరరావు (3) సోమవారం అనారో గ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకు న్నారు.
అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళ వారం సాయంత్రం విజయ నగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు.
ఇక అక్కడి నుంచి గ్రామా నికి సరైన రహదారి లేకపో వడంతో మృతదేహాన్ని మోసుకుని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.