ఈడి కోర్టు న్యాయమూర్తికి ఎమ్మెల్సీ కవిత లేఖ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/:ఏప్రిల్ 09: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ క‌విత స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈకేసులో తాను బాధితురాలినని లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ మేర‌కు ఆమె ఈడీ కోర్టు న్యాయ‌మూర్తికి నాలుగు పేజీలు లేఖ రాశారు.తాను తప్పు చేశాననడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధ రాలు లేవని రెండున్నరేళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితుల స్టేట్మెంట్‌ తో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మీడియా ట్రైలర్ ఎక్కువ జరుగుతుందని సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందన్నారు.

త‌న‌ మొబైల్ నెంబర్‌ను అన్ని ఛానల్‌లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. త‌న‌ రాజకీయ పరపతిని దెబ్బ తీసే విధంగా వివరిస్తున్న రని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరయ్యా తన బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు నా ఫోన్లను కూడా అందజేశానని కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.


ఈడీ, సీబీఐ నమోదు చేస్తోన్న 95 శాతం కేసులన్నీ విపక్ష నేతలకు సంబందించినవేనని బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి ‘నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతాం’ అని బీజేపీ నేతలు అన్నారన గుర్తు చేశారు.

లిక్కర్ స్కామ్ కేసు విచారణకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తనకు బెయిల్ మంజారు చేయాలని అభ్యర్థిస్తున్నానని కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment