ఉత్తర్వులు జారీ చేసినట్లు గురుకుల కార్యదర్శి.
హ్యూమన్ రైట్స్ టుడే/రంగారెడ్డి జిల్లా /ఏప్రిల్ 9: గురుకులాల్లో గానీ స్కూల్లలో గానీ,హాస్టళ్ళల్లో గానీ విద్యార్థులను, బాలికలను బయపెట్టేలా చేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారా? అలాంటి వారికి ఇకపై ముందుంది ముసళ్ల పండుగే ఆహారం బాగాలేదని, అనారోగ్యంగా ఉందని, ఏదైనా సమస్య, ఇబ్బంది వస్తే స్నేహితులకు, తల్లిదండ్రులకు చెబుతున్నారని భయపెట్టే ఆలోచనల నుండి బయటకు రావాల్సిందే ఇక అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆహారం సరిగాలేదని విద్యార్థినీ తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ముందే చితకబాదిన ప్రిన్సిపల్ నిర్మలపై సోమవారం పలు పత్రికల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథనానికి క్రమశిక్షణ చర్యల కింద ప్రిన్సిపల్ నిర్మలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర గురుకుల పాఠశాల కార్యదర్శి సీతాలక్ష్మి తక్షణ చర్యలు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.