విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రి నుంచి కరుడు గట్టిన ఖైదీ పరార్ 

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/విశాఖ జిల్లా/ఏప్రిల్ 07: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని విశాఖపట్నం కింగ్ జార్జి హాస్పిటల్ క్రమేపీ నేరగాళ్ల అడ్డగా మారిపోయిందంటే కేవలం ఆరోపణ కాదు. అనారోగ్యం పేరుతో కేజీహెచ్ లో చేరి పోలీసుల కళ్లగప్పి పారిపోయే నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారిపోయింది ఈ ఆస్పత్రి.

తాజాగా ఇలాంటి ఘటనే శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చోటు చేసుకుంది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఓ కరుడుగట్టిన ఖైదీ వాష్ రూమ్ కి వెళ్లి తనకు సెక్యూరిటీ పోలీసును పక్కకు నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. కేజీహెచ్ లో ఈ ఘటనతో పోలీసులు, విశాఖ జిల్లా యంత్రాంగం, కేజీహెచ్ సిబ్బంది అవాక్కయ్యారు. అప్రమత్తమయ్యారు.

*ఎస్కార్ట్కు ఝలక్ …*

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం, పెదవలస గ్రామానికి చెందిన బోన్నిధి మహాలక్ష్మి అలియాస్ రాజు పోలీసులు కళ్లు గప్పి ఆసుపత్రి నుంచి పారిపోయాడు.

పోస్కో కేసులో కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది. విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. 2022 జూన్ 13 నుంచి ఈ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి పారిపోవటానికి పక్కాప్లాన్ రచించాడు.

2024 మార్చి 11న మెటల్ గోర్లు, జీఐ వైర్ ముక్కలు తిన్నాడు. కడుపునొప్పి బాధపడుతున్నాడని చికిత్స కోసం కేజీహెచ్‌కి తరలించి రాజేంద్ర ప్రసాద్ వార్డులో చేర్పించారు.

మార్చి 22న శస్త్రచికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ వార్డులోకి నిందితుడిని మార్చారు. ఇక ఏప్రిల్ 6న రాత్రి రెండు గంటల సమయంలో డ్యూటీలోని ఎస్కార్ట్ పోలీస్ కు వాష్ రూమ్‌కి వెళ్లాలని చెప్పి అతడిని తోసేసి ఆ వార్డు నుంచి నిందితుడు పారిపోయాడు. వెంటనే ఎస్కార్ట్ రాజనా కళ్యాణ్ (39) పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఖైదీని వెతికే పనిలో పడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment