హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఏప్రిల్ 07:
హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీలోఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్‌ఫైర్ అయి ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ విషాదకర సంఘటన ఓల్డ్‌సిటీలోని ఖబూతర్ ఖానా పోలీస్ పికెట్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్ విధులు నిర్వహి స్తున్న సమయంలో ప్రమాద వశాత్తు గన్ మిస్ ఫైర్ అయ్యిందా? తుపాకితో కాల్చుకున్నాడా? తెలియవలసి ఉంది
దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గతంలో ఇదే పికెట్‌లో గన్ మిస్‌ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందాడు. బాలేశ్వర్ మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.