తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 04:
మొదటి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.

వడగాడ్పుల తీవ్రత పెరిగింది. మరో నాలుగు రోజల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకూ చిన్న పిల్లలు, వృద్దులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

వ్యవసాయరంగంలో ప్రత్యేకించి ఆరుబయట పంట పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవలని హెచ్చరిస్తున్నారు.

అధిక ఉష్ణోగ్రతలు వేడిగాలుల కారణంగా వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయ పనులు ఉదయం 11లోపు ముగించాలని, అదే విధంగా తిరిగి సాయంత్రం మూడు తర్వాత కొనసాగించుకో వచ్చని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా నిడమనూర్‌లో అత్యధికంగా 43.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతవరణం నెలకొంది.

టీక్యాతాండా, ధరూర్‌లో 43.4, పెబ్బేర్‌లో 43.3, నాంపల్లిలో 43.2, కొరట పల్లి, బుగ్గబావిగూడ, తిరుమలగిరి కేంద్రాల్లో 43.1, వడ్డేపల్లిలో 43,కోనై పల్లి, ఇబ్రహింపట్నం, 42.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయిలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2నుండి 3డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment