భార్యాభర్తల మధ్య కలహాలు ఆత్మహత్య చేసుకున్నా నాంపల్లి కోర్టు జడ్జి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 25:
కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో యువ జడ్జి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజి గిరి జిల్లా ఘట్‌కేసర్ మండ లం ముచ్చువెల్లికి చెందిన ఎ.మణికంఠ (36) 2016లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్, గా ఉన్నారు.
ఆయనకు ఏడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలానికి చెందిన లలితతో వివాహ మైంది. వారికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. బాగ్ అంబర్‌పేట పోచమ్మబస్తీలో నివసిస్తు న్నారు.
కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన డంతో ఇటీవల ఆమె కుమా రుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు మణి కంఠ తల్లి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భార్యాభర్తల మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మణికంఠ ఫోన్ పెట్టేశారు. అనంతరం పడక గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తండ్రి శ్రీశైలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.