హైదరాబాద్ లో మూడు నెలల ఆడపిల్లను రోడ్డుపై పడేసిన కన్న తల్లి?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 25:
ఈ దేశంలో అడపిల్లగా పుట్ట డమే తప్పా! ఆడపిల్లగా పుట్టడమే పాపమయి పోయింది. నవీనయుగం లోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో మురిక కాల్వలు, రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేయడం లాంటి ఘటన లు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో ఓ మూడు నెలల చిన్నారిని రోడ్డుపై పడేసింది.ఓ తల్లి ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్ నుంచి ఉప్పల్ హిల్స్‌కి పోయే మార్గంలో చిన్నారి కేకలు విని వాహనదారులు అక్కున చేర్చుకున్నారు.
ఉప్పల్ పోలీసులతో పాటు 108కి వాహనదారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు చిన్నారిని శిశు సంక్షమ శాఖ అధికారులకు అప్పగించారు.