హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/మార్చి 25:
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎనిమిదో రోజు ఈడీ అధి కారులు కవితను విచారిం చారు.
తాజాగా కస్టడీ పొడగింపు అప్లికేషన్ లో మెన్షన్ చేసిన అంశాలపై ఆరా తీసారు. సౌత్ గ్రూప్ లో నగదు బదిలీ,వినియోగంలో కీలక పాత్ర పొశించిన కవిత మేనల్లుడు మేక శ్రీ శరణ్ టార్గెట్ గా కవితను విచారించినట్లు తెలిసింది.
ఇందులో భాగంగా శరణ్ బిజినెస్, లావాదేవీల అంశంపై మరోసారి కవితను ప్రశ్నించారు. దీంతో పాటు ఐటీఆర్, కుటుంబ వ్యాపా రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు సమా చారాన్ని కోరినట్లు తెలిసిం ది.
ఇప్పటికే ఈ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ…ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్ట లేకపోయామని తాజాగా కోర్టుకు వెల్లడించిన విషయం విధితమే. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతోన్నారని, విచారణకు సహకరించ డంలేదని ఆరోపించింది.
దీంతో కవిత నుంచే కాకుండా… లిక్కర్ వ్యాపారీ సమీర్ మహేంద్రు వైపు నుంచి మేక శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమీర్ మహేంద్రుకు ఈడీ సమన్లు జారీ చేసింది.
అయితే ఏ రోజు సమీర్ ను విచారిస్తారనే అంశంపై తెలిపేందుకు ఈడీ అధికా రులు నిరాకరించారు. కేవలం సమీర్ ను ఒక్కడినే విచారిస్తారా… లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ లోని కవిత మాజీ సీఏ బుచ్చి బాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాస్ లుతో కలిపి విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.