హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 24:
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ప్రజా ప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పేరును పోలీసులు ఏ-1 నిందితుడిగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావును ఏ-2గా పేర్కొన్నారు.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాచకొండ మాజీ డీసీపీ రాధాకిషన్ ఏ-3, ఎస్పీలు భుజరంగ రావు ఏ-4, తిరుపతన్న ఏ-5, మరో ప్రైవేట్ వ్యక్తిని ఏ-6గా చేర్చారు.
ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు కనుసన్న ల్లోనే ప్రజా ప్రతినిధుల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లు, డేటా, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడని తేల్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన పోలీసులు అందులోని డేటాను రీట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.