హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 24:
వివిధ దేశాల్లో స్త్రీల ఉత్పత్తి సామర్థ్యం సాంకేతిక రంగాల్లో గణనీయంగా ఉంది. భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో మహిళలు అభివృద్ధి చెందాలంటే ఆయా దేశాల్లోని మహిళలకు లింగవివక్ష లేకుండా అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కలిగిస్తున్నారో ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాలి.
మన దేశంలోనూ దళిత, బహుజన, ఆదివాసి మైనార్టీ స్త్రీలకు విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలను కలుగజేయాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అన్ని రంగాల్లో స్త్రీలకు సమభాగం కల్పించడమే మహిళా సాధికారత అని చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఆర్థిక, సాంఘిక, సాంస్కృ తిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్వితీయమైన కృషి సాగిస్తూ ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థాధిపత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వ్యక్తిత్వ నిర్మాణం నైతికత, ఆత్మ గౌరవం, ఆత్మ స్థైర్యం, అభివ్యక్తి నైపుణ్యం సమాచార సామర్థ్యం కలిగి ఒక్కొక్కడుగు ముందుకు వేస్తున్నారు.
మన దేశంలోనూ మహిళా దినోత్సవం, ఎన్నికలు, తదితర సందర్భాల్లో మహిళల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ మహిళా సాధికారికతకు సంబంధించిన ప్రధానాంశం భూమి పంపకం. భూమిని పంచుతామని ఏ రాజకీయ పార్టీ చెప్పడం లేదు. ఈ విషయం ఏ పార్టీ మ్యానిఫె స్టోల్లోనూ చోటు చేసుకోవడం లేదు.
భారతదేశంలో దళిత బహుజన గిరిజన స్త్రీలు పశువులను ప్రేమగా సాకుతారు. వారికి గానీ మూడు, మూడు గేదెలిచ్చి మరల వారికి ఆ గేదెలు పెంచడానికి 5 ఎకరాల భూమిని గడ్డికిచ్చి మళ్ళీ ఆ గేదెలు తరిపికి వచ్చాక మళ్ళీ మూడు గేదెలు కాని ఇచ్చినట్లయితే క్షీర విప్లవంలో స్త్రీలు భాగస్వాముల వుతారు.
రెండు రాష్ట్రాలలోనూ కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ కులాలకే ఎక్కువ భూమి ఉండటం వల్ల రైతు భరో సాలన్ని, ఉచిత విద్యుత్ పథకాలన్ని అగ్ర కులాలకే ఉపయోగపడు తున్నాయి. మరోప్రక్క దళిత, మైనారి టీ, బహు జన స్త్రీలు అసంఘటిత రంగంలో ఎక్కువగా వున్నారు.
వీరికి పని కాలం 10, 12 గంటలుగా వుంటుంది. అందువల్ల వారు అతి తక్కువ కాలంలోనే వృద్ధు లవుతున్నారు. వారు 50 ఏళ్ళకే వంగిపోతున్నారు. 45 ఏళ్ళకే వాళ్లకు కళ్లు మసకలొస్తున్నాయి. రక్త లేమితో బాధపడుతున్నారు.
దాని వలన వారు దీర్ఘకాలిక వ్యాధులకు గురి అవుతు న్నారు. వారి సంపాదన వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. సరైన ఆహారం వుంటే వారు బలంగా, దృఢంగా వుంటా రు.
శక్తివంతంగా వుంటే వారి పిల్లలను బాగా చదివించు కోగలగుతారు. పని పాటల్లో చురుకుగా వుంటారు. వారికి గాని భూమిని ప్రభుత్వం ఇవ్వగలిగితే వారు తమ పొలంలో పండిన ధాన్యాల వల్ల వారు శక్తివంతమైన ఆహారం తీసుకోగలుగుతారు.