మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రైవేట్ కేసు ఆధారంగా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.