3, 6 తరగతులకు కొత్త సిలబస్‌

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మార్చి 24:
వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించి 3, 6 తరగతుల సిలబస్‌ మారనుందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సీబీఎస్‌ఈ, వెల్లడించింది.

ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అను బంధ పాఠశాలలకు సీబీఎస్‌ ఈ తెలియజేసింది.

3, 6 తరగతుల కొత్త సిల బస్‌తో పాటు పాఠ్యపుస్త  కాలను త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్‌ఈకి విద్య, పరిశోధన, శిక్షణ జాతీయ మండలి ఎన్‌సీ ఈఆర్‌టీ, సమాచారం ఇచ్చింది.

పాఠశాలలన్నీ కొత్త సిల బస్‌ను అనుసరించాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ అకడ మిక్స్‌ జోసెఫ్‌ ఎమ్మాన్యు యేల్‌ సూచించారు. 6వ తరగతి విద్యార్థులకు అద నంగా బ్రిడ్జి కోర్సు ఉంటుంది.

3వ తరగతికి కుదించిన విధివిధానాలను ఎన్‌సీ ఈఆర్‌టీ,విడుదల చేయ నుంది. కొత్త విద్యా విధానా నికి అనుగుణంగా పాఠశా లల అధిపతులకు, ఉపా ధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్ర మాలను చేపడతాం’ అని వివరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment