హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/మార్చ్23: పట్ట పగలే కానిస్టేబుల్ కుటుంబానికే చుక్కలు చూపించిన దొంగలు మిట్ట మధ్యాహ్నం ఇంటికి కన్నం వేసి భారీగా బంగారం, నగదు అపహరణ. జాగ్రత్తలు చెబుతాం కానీ పాటించనీ కానిస్టేబుల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గూపన్ పల్లి లో నివాసముండే A.R.కానిస్టేబుల్ సాయన్న విధులకు వెళ్లగా కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లి వచ్చే సరికి ఇల్లు గుల్ల చేసిన దుండగులు. ఏకంగా ఇంట్లో వుంచిన ఎనిమిది తులాల బంగారు నగలు కొంత నగదు అపహరణ. పట్ట పగలే పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహించే A.R.కానిస్టేబుల్ సాయన్న ఇంట్లో దోపిడీ జరగడం స్థానికంగా కలకలం రేపుతున్న ఘటన చోటుచేసుకుంది.