సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/మార్చ్19: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినందున గతంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అయినట్లు ఆమె తరుపు న్యాయవాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.

కవిత పిటిషన్ ఉపసంహరణకు ఈడీ తరపు న్యాయవాది ఎస్వీ రాజు అభ్యంతరం తెలపలేదు. కాగా.. తన అరెస్ట్ అక్రమమంటూ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. కవిత తరపున వాదించాల్సిన సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ వేరే కోర్టులో బిజీగా ఉన్నందున 11 గంటలకు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తన అరెస్ట్‌పై కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై 11 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment