బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ కు చెందిన 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుంటే వందకుపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..పార్టీలో ఉన్న అసమ్మతిపై ఈ వ్యాఖ్యలు చేశారు.