ఫార్వర్డ్ బ్లాక్ AIFB నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ తోకల నాగరాజుని గెలిపించండి: అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వి. సుందరరామరాజు పిలుపు
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /మార్చ్18: నరసరావుపేట 2024 మార్చి 17వ తేదీ ఉదయం 11 గంటలకు వరలక్ష్మి కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ అభ్యర్థి తోకల నాగరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిజెపికి వత్తాసు పలుకుతున్న వైసీపీ పరోక్షంగాను, టిడిపి జనసేన కూటమి ప్రత్యక్షంగాను ప్రజలను వెల్ఫేర్ స్కీముల మాయాజాలంలో ఇరికిస్తున్నారని ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి
ఓట్లను కునీ రాజకీయాలు నడిపిస్తున్నారని అన్నారు.
మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలుగు ప్రజల ముందుకు వస్తున్నదని
2024 మే13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. 1939 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పోటీలో నిలబడుతుందని ఆయన తెలిపారు.