కొత్త చరిత్ర సృష్టించబోతున్న బెంగళూరు, ఢిల్లీ మహిళల జట్లు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/మార్చి 17:
ప్రతిష్ఠాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా ఆదివారం తుదిపోరు జరుగనుంది.


ఈ ఫైనల్లో కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ వరు సగా రెండోసారి ఫైనల్లో ఆడనుంది. కిందటిసారి జరిగిన ఫైనల్లో ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.

మరోవైపు బెంగళూరు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఢిల్లీ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.

బెంగళూరు శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని ఓడించి ఫైనల్‌కు దూసు కొచ్చింది. లీగ్ దశలో బెంగ ళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

ఈసారి కూడా అదే సంప్రదా యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బెంగ ళూరు కూడా లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బలమైన ముంబైని ఓడిం చడంతో బెంగళూరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.


ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైం ది. కెప్టెన్ స్మృథి మంధాన, సోఫి డివైన్, ఎలిసె పేరీ, రిచా ఘోష్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో పేరీ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది.

ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. బౌలింగ్‌లో కూడా బెంగళూరు బాగానే కనిపిస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల స్కోరును కూడా కాపాడుకుని జట్టును ఫైనల్‌కు చేర్చడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లు జట్టుకు కీలకంగా మారారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment