ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీకి 11.566 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది.
ఏపీ వాటా కింద 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు వచ్చింది.
తెలంగాణకు శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది.