హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 12: తెలంగాణలో గతేడాది టెన్త్ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి ఎస్ఎస్సి బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.